విడుదలకు ముందే వంద కోట్లు వసూల్ చేసిన సల్మాన్!

ఈద్ సందర్భంగా విడుదల అయ్యే సల్మాన్ ఖాన్ సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో కొత్తగా చెప్పనక్కర్లేదు. ఈ పరంపరలో ఈ సారి ‘రేస్ 3’తో వచ్చాడు సల్మాన్. ఈ ప్రాంచైజ్లో సల్లూ తొలిసారి నటించాడు. ఈ భారీ బడ్జెట్ సినిమా ఇంతే భారీ వసూళ్లను సాధిస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ నిపుణులు. రేస్ ప్రాంచైజ్లోని తొలి రెండు సినిమాలూ మంచి విజయాలు సాధించడం, ఈ సినిమాకు సల్మాన్ మానియా తోడు కావడంతో మూడో పార్ట్ కూడా సూపర్ హిట్ కావడం ఖాయమనే అంచనాలున్నాయి. అయితే సల్మాన్ గత ఈద్ సినిమా ‘ట్యూబ్ లైట్’ బాగా నిరాశ పరిచింది. తొలి షోతోనే ప్రేక్షకుల తిరస్కరణకు గురి అయ్యింది ఆ సినిమా. అయితే అది కూడా తొలి వీకెండ్లోనే అరవై కోట్ల రూపాయల వసూళ్లను సాధించుకుంది. ఆ సినిమాతో నిమిత్తం లేకుండా రేస్ త్రీకి పాజిటివ్ బజ్ ఉంది. ఈ నేపథ్యంలో ఇది భారీ వసూళ్లను సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. తొలి రోజు ఈ సినిమా 30 నుంచి 35 కోట్ల రూపాయల వసూళ్లను సాధించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీకెండ్ ముగిసే సరికే వంద కోట్ల రూపాయల వసూళ్లు గ్యారెంటీ అని వీరు విశ్లేషిస్తున్నారు. ఈ మేరకు అడ్వాన్స్ బుకింగ్స్తో జరిగి ఉండవచ్చని అంచనా. పాజిటివ్ బజ్ వచ్చిందంటే భారీ వసూళ్లు ఖాయమని అంటున్నారు.

Related Articles

Leave A Reply

Your email address will not be published.