మహేష్ బాబు 25 వ సినిమా టైటిల్ ఇదే?

ప్రముఖ నటుడు మహేష్ బాబు 25 వ సినిమాపై అనేక వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాని అభిమానులు MB 25 అని పిలుచుకుంటున్నారు. అయితే సినిమా టైటిల్ ఇంకా అధికారికంగా వెలువడలేదు. కొందరు ఈ సినిమా పేరు ‘రాజసం’ అయి ఉంటుందని భావిస్తున్నారు. సినిమాలో హీరో పాత్రని దృష్టిలో ఉంచుకుని ఈ పేరు ఊహించడం జరిగిందని చెప్తున్నారు. ఫస్ట్ లుక్ విడుదల కాగానే తాము సినిమా పేరు కూడా వెల్లడిస్తామని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ 25 వ సినిమాని రాసిన వారు, తెరకెక్కించిన వారు వంశీ పైడిపల్లి. మహేష్ బాబుతో అతనికి ఇది మొదటి సినిమా. పూజా హెగ్డే ఇందులో మహేష్ సరసన నటించనునట్లు సమాచారం. ప్రముఖ కామెడీ స్టార్ అల్లరి నరేష్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడిగా పనిచేస్తారు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్ గా చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరగనుంది. సినిమా ఎక్కువభాగం అక్కడే ఉండబోతోందని సమాచారం. అయితే ఈ సినిమాకు దిల్ రాజు, అశ్వనీదత్ లు నిర్మాతలుగా ఈ సినిమాని నిర్మించబోతున్నారు.

Related Articles

Leave A Reply

Your email address will not be published.