నన్ను తాకితే ఒప్పుకొను అని సామ్రాట్ కు తేజస్వి వార్నింగ్! తనీష్, దీప్తి ఎఫైర్?

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో గొడవలు, అరుపులతో హోరెత్తుతున్నది. లగ్జరీ బడ్జెట్ టాస్క్ నేపథ్యంలో ఇచ్చిన చెరుకు రసం తీసే పని సందర్భంగా రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరాటం తీవ్రస్థాయిలో జరిగింది. 17వ రోజు కార్యక్రమంలో కొత్త ఉద్యోగులను ఏర్పాటు చేసుకొనేందుకు ఎల్లో జట్టు కెప్టెన్ కౌశల్, గ్రీన్ జట్టు యజమాని కిరీటికి చెరో లక్ష రూపాయలు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. సభ్యులను కొనుగోలు చేసేందుకు రెండు జట్ల మధ్య పెద్ద మొత్తంలో రాజకీయాలు జరిగాయి. బుధవారం కార్యక్రమంలో తొలి భాగంలో 100 బాటిళ్ల చెరుకు రసం తీయాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఎల్లో టీమ్ చేసే పనిపై దృష్టిపెట్టేందుకు గణేష్‌ను గ్రీన్ టీమ్ గూఢచారిగా నియమించారు. ఈ సందర్భంగా రెండు జట్ల మధ్య భారీగానే గలాటా జరిగింది. యెల్లో జట్టును గెలుపును ఆపడానికి తేజస్వినిని రూ.10 వేలు ఇచ్చి కొనుగోలు చేశారు. దాంతో తేజస్విని గ్రీన్ టీమ్‌లో చేరిపోయింది. ఉత్తమ ఉద్యోగిగా ఎంపికయ్యేందుకే తాను గ్రీన్ జట్టులోకి వెళ్తున్నానని చెప్పింది. ఈ టాస్క్‌లో ఎల్లో టీమ్ విజయం సాధించింది. ఉత్తమ యజమానిగా కౌశల్, ఉత్తమ ఉద్యోగిగా తేజస్విని ఎంపికయ్యారు. చెరుకు రసం టాస్క్ సామ్రాట్ పై తేజస్విని అలకకు కారణమైంది. టాస్క్ సందర్భంగా సామ్రాట్ దీప్తి, శ్యామలను సామ్రాట్ పట్టుకోవడం తేజస్వినికి నచ్చలేదు. అలాగే సామ్రాట్‌ను మరో లేడి సెలబ్రిటీ ముట్టుకోవడం కోపం తెప్పించింది. నిన్ను మరొకరు పట్టుకోవడం లేదా నువ్వు మరొకరిని ముట్టుకోవడం నాకు నచ్చదు అని సామ్రాట్‌తో తేజస్విని చెప్పింది. నీతో మరొకరు క్లోజ్‌గా ఉంటే నేను తట్టుకోలేను. నా మనస్తత్వం అంతే. నేను చాలా సెన్సిటివ్. ఒకవేళ నీకు ఇష్టమైతే నేనేమీ చేయలేను అని తేజస్విని చెప్పడం ఆసక్తిని రేపింది. ఇక ముందు వారి మధ్య రొమాన్స్ మరో లెవెల్‌కు వెళ్లే అవకాశం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరు ఒకే బాత్రూంలో దూరడం కనిపించింది. బిగ్‌బాస్ హౌస్‌లో దీప్తి సునైన, తనీష్ మధ్య కొత్త అఫైర్ మొదలైంది. స్విమ్మింగ్ పూల్ వద్ద సునైనాకు తనీష్ తన చేతికి ఉన్న బ్రాస్లెట్ ఇవ్వడం వారి మధ్య కొత్త బంధానికి తెర లేచింది.
అర్ధరాత్రి దాగుడు మూతలు బుధవారం అర్ధరాత్రి ఇంటి సభ్యులందరూ నిద్రపోయాక దీప్తి సునైనా, తనీష్ దొంగాట ఆడటం మరో గమ్మత్తైన విషయం. చీకట్లో వారిద్దరూ దాగుడు మూతలు ఆడటం, వారిద్దరిని సామ్రాట్ గమనించడం జరిగింది. తనీష్ బెడ్ పై సునైనా పడుకోవడం, పక్కనే ఉన్న మరో బెడ్‌పై తనీష్ మాట్లాడుతూ పడుకోవడం వారి మధ్య కొత్త బంధం బలపడుతున్నదనడానికి సాక్ష్యంగా నిలిచింది.

Related Articles

Leave A Reply

Your email address will not be published.