టాలీవుడ్ లో కమిట్ అయి, అమెరికాలో షాపింగ్ చేస్తారు!

కాస్టింగ్ కౌచ్ అంశం ఇటీవల టాలీవుడ్ ను కుదిపేసిన విషయం తెలిసిందే. శ్రీరెడ్డి వేదికగా చెలరేగిన ఈ ఉదంతంలో టాలీవుడ్ లో ‘కమిట్మెంట్’ అనేది ‘కాస్టింగ్ కౌచ్’కు పర్యాయపదంగా ఉపయోగపడింది. అయితే టాలీవుడ్ లో ‘కమిట్మెంట్’ అంటే ఎలాంటి అర్ధం వస్తుందో. అమెరికాలో ‘షాపింగ్’ అంటే అలాంటి ఉద్దేశమేనని ప్రముఖ యాంకర్ లాస్య చెప్పుకొచ్చింది.
అమెరికాలో ‘షాపింగ్’కి ఒప్పుకొంటారా? అని అడుగుతారని, షాపింగ్ కి ‘ఓకే’ అంటే అన్నింటికి అంగీకరించినట్టేనని పేర్కొంది. మొదట్లో ఈవెంట్లలో తాను పాల్గొనే దానినని, కానీ ఇక్కడి ఆర్గనైజర్లు తప్పుగా ప్రవర్తించేవారని ఆరోపించారు.
ఓసారి ఓ ఆర్గనైజర్ తనతో తప్పుగా ప్రవర్తిస్తే వార్నింగ్ ఇచ్చానని, పద్ధతిగా సంప్రదాయబద్ధంగా ఉన్న వాళ్లను కూడా ఈ విధంగా అడుగుతున్నారని మండిపడింది. దీంతో తర్వాత ఇలాంటి ఈవెంట్స్ దరిదాపుల్లోకి కూడా తాను వెళ్లడం లేదని, దానికి కారణం ఇలాంటి చెత్త వెధవలేనంటూ అమెరికా ‘షాపింగ్’ ఉదంతాన్ని బయటపెట్టింది. క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం మాదిరే అమెరికాలో టాలీవుడ్ సెక్స్ రాకెట్ గుట్టు కూడా బయటకు వస్తే బాగుంటుందని ఈ సందర్భంగా యాంకర్ లాస్య అభిప్రాయపడింది.

Related Articles

Leave A Reply

Your email address will not be published.