రావణుడి చెల్లి పాత్రలో కాజల్ అగర్వాల్ కనిపించనుందా?!

అందాల చందమామ కాజల్ అగర్వాల్ మనసు విభిన్న చిత్రాలవైపు మళ్లినట్లు తెలుస్తోంది. కాజల్ తన కెరీర్ లో చాలా మంది స్టార్ హీరోల సరసన నటించింది. సౌత్ లో చాలా కాలం స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలపై దృష్టి పెడుతోంది. కాజల్ తదుపతి చిత్రం గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. హిందూ పురాణం గాధ రామాయణంలో రావణుడి సోదరి సూర్పణఖ పాత్ర ఆధారంగా దర్శకుడు భార్గవ్ భారీ చిత్రానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ని సూర్పనఖ పాత్రలో నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సూర్పణఖ అనగానే రాక్షసుడు అయిన రావణుడి సోదరిగానే ఊహించుకుంటాం. ఈ చిత్రంలో సూర్పణఖని అందాల యువరాణిగా కూడా చూపించబోతున్నారు. మగధీర చిత్రంలో ఇలాంటి పాత్ర కాజల్ అగర్వాల్ ఇప్పటికే పోషించింది. దీనితో ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ అయితే బావుంటుందని ఆమెని సంప్రదించినట్లు తెలుస్తోంది. కాజల్ ఈ ప్రాజెక్ట్ కు సూచన ప్రాయంగా ఓకె చెప్పిందని, అధికారికంగా ఇంకా అంగీకరించలేదని సమాచారం. త్వరలో ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Related Articles

Leave A Reply

Your email address will not be published.