మాస్ కథతో ముందుకు రానున్న పూరి జగన్నాథ్!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ జోరు బాగా తగ్గింది. వరుస పరాజయాలలో ఉన్న పూరి తదుపరి చిత్రంతో మంచి విజయం అందుకోవాలని భావిస్తున్నాడు. ఇటీవల పూరి జగన్నాథ్ తన తనయుడు హీరోగా తెరకెక్కించిన మెహబూబా చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. తదుపరి చిత్రం కూడా ఆకాష్ తోనే ఉంటుందని పూరి ప్రకటించాడు. ఆ చిత్రానికి సంబందించిన కథని పూరి పూర్తి చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇండియా, పాక్ వార్ నేపథ్యంలో ప్రయోగాత్మకంగా మెహబూబా చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సారి ఎలాంటి ప్రయోగాలకు పోకుండా పక్కా మాస్ కథ సిద్ధం చేసినట్లు సమాచారం. హీరోయిన్ తో పాటు చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు పూరి త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో పూరి మరి కొంత మంది స్టార్ హీరోలతో కూడా సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

Related Articles

Leave A Reply

Your email address will not be published.