భారతీయుడు 2 చిత్రంలో కాజల్

లోకనాయకుడు కమల్ హాసన్ ,క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందనున్న ‘భారతీయుడు 2’ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా ఎంపికైయిందని కొద్దీ రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలు నిజమేనని దృవీకరించింది కాజల్. అంతే కాకుండా శంకర్ దర్శకత్వంలో నటించడం నా కల అని ఈ చిత్రం తో అది తీరుతుందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది జనవరి నుండి ఆమె ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొననుందని సమాచారం.

ఇక సూపర్ హిట్ మూవీ ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్ గా రానున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మించనుంది. ఈడిసెంబర్ నుండి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

Related Articles

Leave A Reply

Your email address will not be published.