ప్రతిష్టాత్మక చిత్రంలో కమల్ హాసన్ కి జంటగా నయనతార!

హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతో అదరగొడుతున్న లేడి సూపర్‌స్టార్ నయనతార మరో విభిన్నమైన చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రతిష్టాత్మకంగా రూపొందించే ఇండియన్2 చిత్రంలో కీలక పాత్రను పోషించడానికి అంగీకారం తెలిపినట్టు కోలీవుడ్ మీడియా కోడైకూస్తున్నది. ఈ ప్రాజెక్ట్‌లో నయనతార చేరికపై త్వరలోనే చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయనున్నది. గతంలో రజనీకాంత్‌తో చంద్రముఖిలో జంటగా నటించిన నయనతార ప్రస్తుతం కమల్‌తో కూడా జతకట్టడం సెన్సేషనల్ న్యూస్‌గా మారింది. ఇండియన్2 చిత్రం 2019లో సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం, అనిరుధ్ రవిచంద్రన్ సంగీత దర్వకత్వం వహించనున్నారు. ఇక నయనతార నటించిన కోలమావు కోకిల, ఇమైక్క నోడిగల్ చిత్రాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. టాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సైరా నర్సింహారెడ్డి చిత్రంలో చిరంజీవి సరసన ప్రధానమైన పాత్రను పోషిస్తున్నది. ఈ చిత్రంలో అమితాబ్‌తో కలిసి కొన్ని సన్నివేశాల్లో నటించడం గమనార్హం.

Related Articles

Leave A Reply

Your email address will not be published.