‘పంతం’తో ప్రేక్షకుల ముందుకు గోపీచంద్!

ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ హీరోగా నటిస్తున్న 25వ చిత్రం ‘పంతం’.హిట్ చిత్రాల మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ మ్యూజిక్ అందించారు.
జూలై 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘పంతం’ మూవీ ప్రమోషన్స్లో భాగంగా గత రాత్రి (జూన్ 21) ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో అశేష ప్రేక్షకాభిమానుల సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ దేవినేని ఉమామహేశ్వర్రావు, ఎఫ్.డి.సి.చైర్మన్ అంబికా కృష్ణ, దేవినేని అవినాశ్, దేవినేని చందు, ఎగ్రెసివ్ హీరో గోపీచంద్, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, గోపీచంద్ మలినేని, రత్నకుమార్, భాస్కర భట్ల, సంపత్ నంది, బాబీ, మెహరీన్, గోపీసుందర్, ప్రసాద్ మూరెళ్ల తదితరులు పాల్గొన్నారు.
ఎన్నో హిట్ చిత్రాలకు వర్క్ చేసిన ప్రముఖ రచయిత కె. చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై నిర్మాత కె.కె. రాధామోహన్ ‘పంతం’ చిత్రాన్ని భారీ బడ్జెట్తో, హై టెక్నికల్ వేల్యూస్తో నిర్మించారు.

Related Articles

Leave A Reply

Your email address will not be published.