నాని, నాగార్జున మల్టీస్టారర్ కోసం ఆల్ టైమ్ క్లాసిక్ టైటిల్!

కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. నాగార్జున అరుదుగా మాత్రమే మల్టీస్టారర్ లో కనిపించటం చూస్తుంటాం. ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొని ఉంది. సాయిరాం ఆదిత్య ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి దేవదాసు అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దేవదాసు పేరు వినని సినీ అభిమాని ఉండరు. ఎన్నార్, సావిత్రి ఆల్ టైమ్ క్లాసిక్ చిత్ర టైటిల్ ఇదే కావడం విశేషం. ఈ టైటిల్ ని ఉపయోగించుకోవడం అంటే పెద్ద సాహసమే అని చెప్పొచ్చు. చిత్రీకరణ విషయానికి వస్తే ఈ చిత్ర షూటింగ్ సగభాగం పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆకాంక్ష సింగ్, రష్మిక మందన ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Related Articles

Leave A Reply

Your email address will not be published.