మంచి వసూళ్ళు రాబడుతున్న ‘పంతం’, గోపీచంద్ కెరీర్లోనే బెస్ట్?

మాస్ హీరో గోపీచంద్‌కు మొత్తానికి ఓ బ్రేక్ వచ్చింది. గత కొంతకాలంగా ఫ్లాపులతో సతమతమవుతున్న గోపీచంద్‌కు ‘పంతం’ మంచి రిలీఫ్ ఇచ్చింది. సినిమాపై మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఆ ప్రభావం తొలిరోజు కలెక్షన్స్‌పై పడలేదు. సినిమాకు మంచి ప్రచారం చేయడం, ట్రైలర్లో సోషల్ మెసేజ్‌తో కూడిన డైలాగులు ఉండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. ఈసారి గోపీచంద్ కచ్చితంగా హిట్ కొడతాడనే కాన్ఫిడెన్స్‌తో ఆయన అభిమానులు సైతం ఆత్రుతగా ఎదురుచూశారు. మొత్తానికి శుక్రవారం విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లకు బాగానే రప్పించింది. ‘పంతం’ ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద తొలిరోజు రూ.5.2 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీనిలో డిస్ట్రిబ్యూటర్ల షేర్ విలువ రూ.3.22 కోట్లు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ‘పంతం’ షేర్ విలువ రూ.2.93 కోట్లు. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు అత్యధిక షేర్ రాబట్టిన గోపీచంద్ చిత్రాల్లో ‘పంతం’ రెండో స్థానంలో ఉంది. అంతకు ముందు ‘గౌతమ్‌నంద’ రూ.3.15 కోట్ల షేర్ రాబట్టింది. కానీ ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే గోపీచంద్ కెరీర్లోనే తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా ‘పంతం’ నిలిచింది. ఈ వారంతంలో కూడా ‘పంతం’ మంచి వసూళ్లనే రాబట్టే అవకాశం ఉంది. మరోవైపు ‘తేజ్ ఐ లవ్ యూ’ చిత్రానికి నెగిటివ్ టాక్ వస్తుండటంతో ప్రేక్షకులు ‘పంతం’ వైపే మొగ్గుచూపించొచ్చు. రచయిత కె.చక్రవర్తి దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం ‘పంతం’. ఇది గోపీచంద్‌కు 25వ చిత్రం కావడం విశేషం. సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మించారు. గోపీ సుందర్ సంగీతం అందించారు. గోపీచంద్ సరసన మెహ్రీన్ హీరోయిన్గా నటించింది.

Related Articles

Leave A Reply

Your email address will not be published.