బిగ్ బాస్ 2 లో తగాదాలు! కొట్టుకునేదాకా వెళ్లారు!

బిగ్ బాస్ సీజన్ 2లో అసలు సిసలు రచ్చ మొదలైంది. 12 ఎపిసోడ్లు పూర్తైన తరువాత నాని అన్నట్టుగా ఇంకాస్త మసాలా దట్టించారు. హౌస్ మేట్స్ ఒకర్నొకరు తిట్టుకోవడం, దూషించుకోవడలతో ఆకకుండా కొట్టుకునే వరకూ వెళ్లింది. శుక్రవారం నాటి (జూన్ 22) ఎపిసోడ్లో బిగ్ బాస్ షోకి కావాల్సిన అసలు సిసలు నాటకీయతను జోడించారు. ఈ ఎపిసోడ్లో నూతన్ నాయుడు విశ్వరూపం చూపించారు. భోజనం చేసేటప్పుడు చాలా వేస్ట్ చేస్తున్నారని.. తిన్ని ప్లేట్లు కూడా సరిగా క్లీన్ చేయడం లేదంటూ వండిపెడుతున్న తేజస్విని కెప్టెన్ సామ్రాట్ దృష్టికి తీసుకురావడంతో సామ్రాట్ తిన్న ప్లేట్లను కూడా కడగటం తెలియదా.. మీ ఇళ్లల్లో నేర్పించలేదా అంటూ క్లాస్ పీకారు. అప్పటి వరకూ సైలెంట్గా ఉన్న నూతన్ నాయుడు ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యారు.
ఏదైనా ఉంటే హౌస్లో తేల్చుకోవాలి. అంతేకాని కుటుంబాల గురించి మాట్లాడితే ఊరుకునే పరిస్థితి లేదంటూ ఆవేశంతో సామ్రాట్ పైకి దూసుకు వచ్చారు నూతన్ నాయుడు. మిగిలిన సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేసిన శాంతించలేదు. దీంతో మధ్యలో కలగజేసుకున్న తనీష్.. సామ్రాట్ని వెనకేసుకుని వస్తూ.. నూతన్ నాయుడు పైకి దూసుకు వచ్చాడు. నూతన్ నాయుడ్ని కొట్టేంత పని చేయడంతో నూతన్ నాయుడు అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఇక్కడ ఎవరూ గాజులు తొడిగించుకోలేదంటూ’ వ్యక్తిత్వంలో నా ఎడమకాలి గోటికి కూడా సరిపోడు అంటూ ఉగ్రరూపం దాల్చారు నూతన్ నాయుడు. ఆ తరువాత సామ్రాట్ తాను ఫ్యామిలీ గురించి మాట్లాడలేదని.. నూతన్ నాయుడుకి చెప్పడంతో ఇద్దరూ శాంతించారు.

Related Articles

Leave A Reply

Your email address will not be published.