బాబు గోగినేని బిగ్ బాస్ 2 విన్నర్ అని అంచనాలు!

బిగ్ బాస్ సీజన్ 2.. భారీ అంచనాలతో జూన్ 10న ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రేక్షకులు ఊహించిన స్థాయిలో లేకపోయినా.. రేటింగ్స్ పరంగా సత్తా చాటుతోంది. నాని హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా.. 16 మంది సెలబ్రిటీలతో ప్రతిరోజు బుల్లి తెర ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తుంది. అయితే ఇప్పటికే 12 ఎపిసోడ్లు పూర్తి కావడంతో సీజన్ 1తో పోలిస్తే.. సీజన్ 2లో పెద్దగా ఆసక్తికరమైన అంశాలు ఏమీ లేవని మెజారిటీ ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు. దీనికి తోడు ఎన్టీఆర్ స్థాయిలో నాని ఆకట్టుకోలేకపోవడం.. 16 మంది కంటెస్టెంట్స్‌లో పాపులర్ నటీనటులు లేకపోవడం ప్రధాన డ్రాబ్యాక్. ఇక ఏ మాత్రం వినోదాత్మకం లేకుండా సీజన్ 1లో ఉన్న టాస్క్‌లనే సీజన్ 2లో కూడా రిపీట్ చేయిస్తుండటం ప్రేక్షకులకు విసుగు కలిగిస్తుంది. మరి 100 రోజులపాటు ఈ కార్యక్రమాన్ని ఇదే తరహాలో నడిపిస్తే.. రేటింగ్ డమాల్ కావడం ఖాయమే. ఇక రెస్పాన్స్ సంగతి పక్కనపెడితే.. బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్స్‌లో విన్నర్ అయ్యే అవకాశం ఎవరికి ఉంది అంటే తొలి నుండి తనీష్, తేజస్వి మదివాడ, సింగర్ గీతా మాధురి పేర్లు ఎక్కువగా వినిపించాయి. అయితే బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచే పెర్ఫామెన్స్ ఇప్పటి వరకూ వీళ్లు ఇవ్వలేదనే చెప్పాలి. ఇకపోతే బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ అందరూ ఒకరకమైన దారిలో గేమ్ ప్లాన్ వర్కౌట్ చేస్తుంటే.. బాబు గోగినేని మాత్రం భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. తనకు నచ్చని విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు నేను చేయను అంటూనే.. బిగ్ బాస్‌నే రా.. రా.. బిగ్ బాస్ చెప్తా నీ పని అంటూ వార్నింగ్ ఇవ్వడంతో బాబు గోగినేనికి అనుకూలంగా సోషల్ మీడియాలో ఫన్నీ ట్రోల్స్ మొదలుపెట్టాశారు ట్రోలర్స్. బాబు గోగినేని బిగ్ బాస్ 2 విన్నర్ అంటూ బలమైన లాజిక్‌నే లాగారు ట్రోలర్స్.

Related Articles

Leave A Reply

Your email address will not be published.