Jathi Ratnalu OTT Released-April 11th 2021, Amazon Prime

తన తొలి ఫిల్మ్ఫేర్ అవార్డును వేలం వేయడానికి సిద్ధమైన విజయ్ దేవరకొండ, కేటీఆర్ ప్రశంస!

ఫిల్మ్ ఫేర్స్ అవార్డ్ అందుకున్న నటుడు విజయ్ దేవరకొండను తెలంగాణ మంత్రి కేటీఆర్ అభినందనలతో ముంచెత్తారు. తొలి ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నందుకు కంగ్రాట్స్ తెలిపారు. అవకాశం ఉంటే ఈ అవార్డును వేలం వేసి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఇస్తానంటూ విజయ్ చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ ఫిదా అయ్యారు. ‘అర్జున్ రెడ్డి’ చిత్రంలో నటనకుగాను 65వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుకలో విజయ్ దేవరకొండ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, జూ ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి దిగ్గజాలు రేసులో ఉండగా… విజయ్ దేవరకొండ అందరినీ వెనక్కి నెట్టి ఈ అవార్డు అందుకున్నారు. ఉత్తమ నటుడు అవార్డుతో విజయ్
కెరీర్లో తొలి ఫిల్మ్ఫేర్ అవార్డు, అందులోనూ ఉత్తమ నటుడు కేటగిరీలో అందుకోవడంపై విజయ్ దేవరకొండ చాలా సంతోషంగా ఉన్నారు.