సభ్యుల మధ్య అఫైర్ చిచ్చు.. జైల్లో గీతామాధురి, బిగ్బాస్ లో వింత పరిణామాలు!

తెలుగు బిగ్బాస్2 రియాల్టీ షోపై రోజు రోజుకు ఆసక్తి పెరుగుతున్నది. సోమవారం నాటి షోలో బ్రహ్మండమైన హైడ్రామాకు బిగ్బాస్ తెరతీశాడు. అమిత్, తనీష్లతో డ్రామా ఆడించడం, ఇంటి సభ్యుల మధ్య విభేదాలు సృష్టించడం, నామినేషన్ ప్రక్రియను ముగించడం, అలాగే గీతా మాధురిని జైల్లో పెట్టడం సోమవారం నాటి గేమ్లో ముఖ్యాంశాలుగా మారాయి. ఆదివారం రాత్రి ఒకే బెడ్ మీద తనీష్, దీప్తి సునైన పడుకోవడం, అలాగే వారిద్దరూ దుప్పట్లో దూరి పోవడం ఇంట్లో శ్యామల, గీతా, యాంకర్ దీప్తి మధ్య భారీ చర్చే జరిగింది. ఊళ్లో అమ్మలక్కలను మించి పాత్రలను వీరు పోషించారు. దీప్తి సునైన, తేజస్విని సాగిస్తున్న రొమాన్స్ గురించి గుసగుసలాడటం జరిగింది. తనపై చాటుమాటుగా గుసగుసలాడుతున్న వ్యవహారంపై బాబు గోగినేనితో తేజస్విని చెప్పుకొని బాధపడింది. సామ్రాట్ మా మధ్య ఏదో సెన్సిటీవ్ ఫీలింగ్ డెవలప్ అయింది. ఆయన జీవితంలో జరిగిన చేదు సంఘటన, నా జీవితంలో చోటు చేసుకొన్న విషయం మా ఇద్దరి దగ్గరకు చేసింది. దాని గురించి పెద్దగా మాట్లాడుకోవడం ఎందుకు అని బాధపడింది. తేజస్వినికి ఈ విషయంలో బాబు గోగినేని ధైర్యం చెప్పారు. సోమవారం మధ్యాహ్నం తనీష్, అమిత్ను కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి ఓ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. దాని ప్రకారం ఏదో ఒక నాటకం ఆడి ఇంటి సభ్యులను నమ్మిస్తే అందరికీ మంచి విందు ఏర్పాటు చేస్తానని బిగ్బాస్ హామీ ఇచ్చారు. దాంతో సునైనతో అఫైర్ అంశాన్ని వివాదంగా మలచాలని తనీష్, అమిత్ ప్లాన్ వేశారు. బిగ్బాస్ సూచన మేరకు కన్ఫెషన్ రూమ్ నుంచి ఏడుపు ముఖం పెట్టుకొని తనీష్ సీరియస్గా స్కోక్ంగ్ జోన్కు వెళ్లగా.. దీప్తీ అఫైర్ గురించి మాట్లాడుకోవడం సీరియస్ అయిందని అమిత్ అసలు డ్రామాను రక్తి కట్టించారు. ఈ వ్యవహారంతో దీప్తి సునైన హర్ట్ అయింది. గీతా, శ్యామల, దీప్తి భానుశ్రీపై తేజస్విని భగ్గుమన్నది. అమిత్, తనీష్లను కన్ఫెషన్ రూమ్కు పిలువడంపై ఇంట్లో పెద్ద చర్చ జరిగింది. గీతామాధురి, శ్యామల, నందిని, దీప్తితో కూడిన బృందం డిఫెన్స్లో పడింది. ఇదిలా కొనసాగుతుండగానే నామినేషన్ ప్రక్రియపై గీతా మాధురి మాట్లాడి ఇంటి నియమాలను ఉల్లంఘించింది. అంతేకాకుండా ఓ గ్రూప్ను మేనేజ్ చేయడం కూడా జరుగుతున్నది. నాలుగో వారానికి కోసం బిగ్బాస్ ఇంట్లో నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఈ ప్రక్రియలో సామ్రాట్, తనిష్క తప్ప మిగితా వారందరూ ఒకరిని మరొకరు నామినేట్ చేసుకొన్నారు. ఈ వారం ఇంటి సభ్యుల్లో చాలా మంది నామినేట్ కావడం విశేషంగా మారింది. ఎవరు ఉంటారో ఎవరు పోతారో అనే చర్చకు దారితీసింది. ఇంటి నియమాలను ఉల్లఘించిన గీతా మాధురికి బిగ్బాస్ జైలు శిక్ష విధించాడు. బిగ్బాస్ పలుమార్లు హెచ్చరించినా నామినేషన్ గురించి చర్చించడం సీరియస్గా మారింది. జైలు గోడపై వందసార్లు తప్పు జరిగింది అని రాయమని బిగ్బాస్ ఆదేశించాడు. అంతేకాకుండా కిరిటీ విసిరిన బాంబు, బాక్సింగ్ గ్లౌస్లను తొడుక్కోవాలని హెచ్చరించారు.

Related Articles

Leave A Reply

Your email address will not be published.