శ్రీ రెడ్డికి నాన్ లీగల్ నోటీసులు?!

సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్కు వ్యతిరేకంగా ఒక విప్లవాన్నే నడిపింది శ్రీరెడ్డి. తన చేష్టలతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతల దగ్గర నుంచి హీరోల వరకు అమ్మాయిలను వాడుకుంటున్నారని బహిరంగంగా తన గొంతును వినిపించింది. అంతేకాకుండా ఒక్కక్కొకరి పేర్లను బయటపెట్టింది. దగ్గుబాటి అభిరామ్తో మొదలుపెట్టి ఆఖరికి పవన్ కళ్యాణ్పై కూడా విరుచుకుపడింది. ఎవ్వరినీ లెక్కచేయలేదు. ఎవరికీ భయపడలేదు. అయితే ఆమె తాజాగా నేచురల్ స్టార్ నానిపై కూడా ఆరోపణలు చేసింది. నాని తనను శారీరకంగా వాడుకున్నాడని, ఇప్పుడు అవకాశాలు రాకుండా అడ్డుకుంటున్నాడని ఫేస్బుక్ వేదికగా శ్రీరెడ్డి ఆరోపించింది. తనను ఎలా వాడుకున్నాడో, ఇప్పుడు అవకాశాలు రాకుండా ఎలా అడ్డుకుంటున్నాడో స్పష్టంగా ఫేస్బుక్ పోస్టులో పేర్కొంది. శ్రీరెడ్డి ఆరోపణలపై నాని పరోక్షంగా స్పందించారు. నేరుగా మీడియా ముందుకు రాకుండా ట్విట్టర్ ద్వారా శ్రీరెడ్డిని హెచ్చరించారు. శ్రీరెడ్డిపై పరువు నష్టం దావా వేస్తున్నానని, లీగల్ నోటీసులు కూడా పంపానని నాని తన ట్వీట్లో పేర్కొన్నారు. ‘నేను స్పందించి ఆ బురదను నాకు అంటించుకోవడంలేదు. వాళ్లు ఏం కోరుకుంటున్నారో అది నేను ఇవ్వడంలేదు. లీగల్ యాక్షన్ తీసుకుంటున్నాను. పరునష్టం దావా వేయడానికి లీగల్ నోటీసులు పంపించాను. ఒకరు కొంత మందిని టార్గెట్ చేస్తూ వాళ్ల పేర్లను ఎంచుకొని నిరాధారమైన పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి వాళ్లకు దీనితో ఎలాంటి సంబంధంలేదు. ఇదే నన్ను డిస్టర్బ్ చేస్తోంది. నేను నా గురించి కలతచెందలేదు. మనం నివసిస్తోన్న ఈ సమాజం గురించి కంగారుపడుతున్నాను. క్లిక్కులు, వ్యూస్ కోసం దీన్ని కొంతమంది పబ్లిష్ చేయడం సిగ్గుచేటు. మీ అందరికీ కుటుంబాలు ఉన్నాయి’ అని నాని తన ట్వీట్లో పేర్కొన్నారు. అయితే, నాని ట్వీట్కు శ్రీరెడ్డి రిప్లై ఇచ్చింది. ‘కచ్చితంగా లీగల్గా ఫైట్ చేద్దాం’ అంటూ స్పందించిడి.

Related Articles

Leave A Reply

Your email address will not be published.