మరోసారి తండ్రయిన ఎన్టీఆర్.. మళ్ళీ కుమారుడే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మళ్లీ తండ్రయ్యారు. ఆయన కుటుంబంలోకి మళ్లీ ఓ బుల్లి హీరో వచ్చి చేరాడు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి గురువారం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. తనకు కొడుకు పుట్టిన విషయాన్ని ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేశారు. ‘కుటుంబం పెరుగుతూ పెద్దదవుతోంది.. కొడుకు పుట్టాడు’ అని తారక్ తన ట్వీట్లో పేర్కొన్నారు. దీంతో ఎన్టీఆర్ ఇద్దరు కొడుకుల తండ్రయ్యారు. కొడుకు పుట్టినట్లు ఎన్టీఆర్ ప్రకటించిన వెంటనే అభిమానుల నుంచి అభినందనల వెల్లువ మొదలైంది. ఆయన ట్వీట్ చేసిన అరగంటలోనే మూడు వేల మందికి పైగా రీట్వీట్ చేశారు. 10వేలకు మంది పైగా లైక్ చేశారు. రెండు వేలకు మంది పైగా కామెంట్లు చేశారు. ఎంతైనా నందమూరి వంశం కదా.. ఫాలోయింగ్ ఆ రేంజ్లో ఉంటుంది మరి. ఇదిలా ఉంటే, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఇన్స్టాగ్రామ్లోకి వచ్చిన కొద్దిసేపటికే 70,000 మంది ఫాలోవర్లు చేరడం విశేషం. ఇందులో తన మొదటి పోస్ట్గా ‘అరవింద సమేత.. వీర రాఘవ’ పోస్టర్ను పోస్ట్ చేశారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్లుక్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇందులో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. హారిక అండ్ హాసిని బ్యానర్పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

Related Articles

Leave A Reply

Your email address will not be published.