బిగ్ బాస్ ఇంట్లోకి తన అందంతో ఆనందం ఇవ్వడానికి వస్తున్న కొత్త బ్యూటీ!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 విజయవంతంగా తొలి వారం పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ గేమ్లో భాగంగా ప్రతి వారం ఇంటి నుండి ఒకరు ఎలిమినేట్ అవ్వడం తప్పనిసరి. తొలి ఎలిమినేషన్లో ప్రేక్షకులు సంజనను బయటకు పంపేశారు. అయితే ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ ఇంట్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ రూపంలో…. కొత్త కంటెస్టెంట్ ఎంటరైంది. ఆమె ఎవరో కాదు హీరోయిన్ నందినీ రాయ్. ఈ హాట్ బ్యూటీ బిగ్ బాస్ ఇంట్లోకి కొత్త కంటెస్టెంటుగా ఎంటరవుతున్నట్లు ఆదివారం రాత్రి ప్రసారమైన షోలోనే నాని ప్రకటించారు. సోమవారం నుండి ప్రసారం అయ్యే షోలో నందినీ రాయ్ ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయబోతోంది. ఇంట్లోకి ఎంటరైన నందినీ రాయ్
సోమవారం ఉదయం నందినీ రాయ్ బిగ్ బాస్ ఇంట్లోకి ఎంటరైంది. నందినీ రాయ్ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వగానే ఇంటి సభ్యులంతా ఆశ్చర్యపోయారు. అందరూ కలిసి వెళ్లి ఆమెను ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించారు. నందినీ రాయ్ అందానికి ఫిదా
నందినీ రాయ్ అందం చూసి ఇంటి సభ్యులు ఫిదా అయిపోయారు. ఇక బిగ్ బాస్ ఇంట్లోని మేల్ కంటెస్టెంట్స్ నందినీ రాయ్ అందం చూసి ఫిదా అయిపోయారు. ఆమె రాకతో వారిలో మరింత ఉత్సాహం నెలకొంది. మొదటి సీజన్లో బిగ్ బాస్ షోకు గ్లామర్ అద్దేందుకు దీక్షా పంత్ను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఆ తరహాలోనే ఈ రెండో సీజన్లో షోను మరింత గ్లామరస్ గా మార్చేందుకు నందినీ రాయ్ను ప్రవేశ పెట్టినట్లు తెలుస్తోంది.

Related Articles

Leave A Reply

Your email address will not be published.