బిగ్బాస్ హౌస్ లో సంజన సందడి!

నాని అదిరిపోయే ఎంట్రీతో ఆదివారం నాడు (నిన్న) 16 మంది సెలబ్రిటీలు మధ్య సమరం బిగ్ బాస్ సీజన్ 2 మొదలైంది. తొలిరోజు ఎపిసోడ్లో కంటెస్టెంట్స్ పరిచయాలు.. ప్రొఫైల్స్తో సరదాగా సాగగా.. అంతకు మించిన జోష్తో రెండో ఎపిసోడ్ నేడు (జూన్ 11) ప్రారంభమైంది. ఇక సామాన్యులుగా బిగ్బాస్ హౌస్లో సామాన్యులుగా ఎంట్రీ ఇచ్చి తొలిరోజే సెలబ్రిటీలందరూ కలిసి మూకుమ్మడిగా నూతన్ నాయుడు, సంజనా అన్నేలను బిగ్ బాస్ జైలులో ఉండేందుకు నామినేట్ చేయడంతో రెండోరోజు జైలులో ఉన్నారు. తాము బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తొలిరోజే జైలులో ఉంచడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసింది మోడల్ సంజనా. సెలబ్రిటీలు అంటే సామాన్యుల్ని కలుపుకోవాలి కాని ఇలా సెపరేట్గా ట్రీట్ చేయడం నచ్చలేదంటూ తన బాధను నూతన్ నాయుడుతో పంచుకుంది. ఇక హౌస్లో చాలా మంది సెలబ్రిటీలు అంటున్నారే కాని.. అందులో చాలా మంది పేర్లు తనకు తెలియదన్నారు. కిరీట దామరాజు ఏయే సినిమాల్లో నటించారో తెలియదని, దీప్తి సునైనా కూడా పెద్దగా తెలియదన్నారు. ఇక బిగ్ బాస్ హౌస్లో ర్యాప్ సింగర్ రోల్ రైడా తన అద్భుతమైన పెర్ఫామెన్స్ బిగ్బాస్ హౌస్లో చూపించారు. తనదైన శైలిలో ర్యాప్ సాంగ్స్ పాడుతూ మిగిలిన కంటెస్టెంట్స్ని ఎంటర్టైన్ చేశారు.
మోడల్ సంజనా.. యూట్యూబ్ సంచలనం దీప్తి సునైనాను పరిచయం చేసుకుని.. నీ పేరు దీప్తి సునైనా అని తెలియదని.. అయితే బనానా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటే ఎవరో అనుకున్నా.. అది మీరే తరువాత తెలిసిందన్నారు. ఇంతకీ మిమ్మిల్ని బనానా అని ఎందుకు అంటారని దీప్తి సునైనాని అడుగగా.. వాళ్లకు గుర్తుండేందుకు సునైనాను బనానా అని ట్రోల్ చేస్తున్నారన్నది సునైనా. అయితే బిగ్బాస్ జైలులో ఉన్న ఇద్దర్లో ఒకర్ని జైలు నుండి బయటకు తీసుకువచ్చే అవకాశాన్ని కంటెస్టెంట్స్కు ఇవ్వడంతో అందరూ కలిసి నూతన్ నాయుడ్ని బిగ్బాస్ జైలు నుండి బయటకు తీసుకువచ్చారు. ఇక బిగ్ బాస్ జైలులోనే ఉండిపోయింది సంజనా. ఇక బిగ్బాస్ టాస్క్లో భాగంగా పోస్ట్ బాక్స్ టాక్స్ ఇచ్చారు బిగ్ బాస్. దీనిలో భాగంగా ఒక్కొక్కరూ ఒక్కో లెటర్ తీసుకుని అందులో ఏమున్నదో చదివి వినిపించాలన్నారు. ఇందులో తనీష్కి స్మిమ్మింగ్ ఫూల్లో ఉన్న నీటిని స్పూన్తో తోడాలంటూ టాస్క్ ఇవ్వగా.. నూతన్ నాయుడు వేసుకున్న ఫ్యాంట్తో సహా స్టోర్ రూమ్లో పెట్టాలన్నారు. కౌశల్ తనకు జైల్ ఫ్రీ కార్డ్ ఇచ్చారు. దీని సాయంతో జైలులో ఉన్న సంజనాను విడిపించుకోవచ్చునని.. లేదంటే మీకోసం దాచుకోవచ్చంటూ బిగ్ బాస్ ఆప్షన్ ఇవ్వడంతో కౌశల్ ఆ జైల్ ఫ్రీ కార్డును తన కోసం దాచుకుంటా అన్నారు. ఇక బిగ్బాస్ హౌస్లో కీలకమైన తొలి ఎలిమినేషన్కి నామినేషన్స్ ప్రారంభించారు బిగ్ బాస్. ఇందులో భాగంగా ఒక్కో సెలబ్రిటీ ఇద్దరిద్దర్ని నామినేట్ చేయాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశించారు. ఇందులో ఈ ఎలిమినేషన్స్లో అత్యధికంగా సామాన్యుడు గణేష్కి 5 ఓట్లు వచ్చాయి. అనంతరం జిల్ జిల్ జిగేల్ రాణి సాంగ్తో గీతా మాధురి తన గాన మాధుర్యాన్ని వినిపించగా.. తేజస్వి మదివాడ,రోల్ రైడా స్టెప్పులేశారు. అయితే బిగ్ బాస్ జైలులో ఉన్న సంజనా ఒంటిరిగా దోమలు, పురుగులతో నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడింది పడటంతో సింగర్ గీతా మాధురి, శ్యామలలు ధైర్యం చెప్పారు. మరి రేపటి ఎపిసోడ్నైనా సంజనాను బిగ్ బాస్ జైలు నుండి విడిపిస్తారేమో చూడాలి.

Related Articles

Leave A Reply

Your email address will not be published.