ప్రియాంక రెమ్యునరేషన్ 12 కోట్లు?!

మూడు సంవత్సరాల తర్వాత ఒక బాలీవుడ్ సినిమాలో నటించబోతోంది ప్రియాంక చోప్రా. హాలీవుడ్ సినిమాలతో, టీవీ సీరిస్లతో బిజీగా ఉన్న ప్రియాంక సల్మాన్ హీరోగా నటిస్తున్న భరత్ తో బాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ సినిమాలో నటిస్తున్నందుకు గానూ ప్రియాంక భారీ రెమ్యూనరేషన్నే చార్జ్ చేస్తోందని సమాచారం. ఈ సినిమాకు గానూ ప్రియాంక ఏకంగా 12 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ను పొందుతోందని సమాచారం. ఇది బాలీవుడ్లో భారీ నంబర్ అనే చెప్పాలి. ప్రియాంక హాలీవుడ్లో అవకాశాలు పొందక ముందు బాలీవుడ్లో ఈ స్థాయి పారితోషకం పొందేది కాదు. హాలీవుడ్ నుంచి వస్తున్నందుకు ఈమె భారీ మొత్తాన్ని పొందుతోంది అని సమాచారం. వాస్తవానికి ఈ సినిమాలో నటిస్తున్నందుకు గానూ ప్రియాంక 14 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ను డిమాండ్ చేసిందట. అయితే అంతిమంగా 12 కోట్ల రూపాయలకు ఫిక్స్ చేశారని సమాచారం. చివరగా ప్రియాంక ‘బాజీరావ్ మస్తానీ’ సినిమాలో నటించింది. ఆ సినిమాలో ప్రియాంకతో పాటు దీపికా పదుకునే కూడా నటించింది. అందులో ప్రియాంక మరీ ఈ స్థాయి పారితోషకం పొందలేదు. హాలీవుడ్ లో అవకాశాల నేపథ్యంలో మాత్రం ప్రియాంక రెమ్యూనరేషన్ భారీగా పెరిగింది.

Related Articles

Leave A Reply

Your email address will not be published.