డేటింగ్ వెబ్సైట్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అపూర్వ?!

పెరుగుతున్న టెక్నాలజీ యుగంలో సైబర్ నేరాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. కొంతమంది సైబర్ నేరగాళ్లు డేటింగ్ వెబ్ సైట్ల పేరుతో అందమైన హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్లను ఫోటోలను ఎరగా వేసి విటులకు కుచ్చటోపీ పెడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వెబ్ సైట్లో ప్రముఖ నటి అపూర్వ ఫోటో ఉండటంతో పాటు ఆమెకు రూ. 40 వేలు రేటుకట్టిన సైబర్ నేరగాళ్లు హైదరాబాద్ పోలీసులకు చిక్కారు. వివరాళ్లోకి వెళ్తే.. ‘లొకాంటో’ అనే డేటింగ్ వెబ్సైట్లో తన ఫోటోతో పాటు రూ.40 వేల రూపాయలు రేటు ఫిక్స్ చేసి సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టుచేశారు నటి అపూర్వ. తనతో పాటు ఈ వెబ్ సైట్లో అనేక మంది అందమైన అమ్మాయిలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ల ఫోటోలను వారికి సంబంధించిన వివరాలతో పాటు వారితో గడిపేందుకు ఫిక్స్ రేట్ను డిసైడ్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు చొక్కారపు గణేష్ అనే వ్యక్తి. అయితే ఈ వెబ్ సైట్లో తన ఫోటో ఉండటం చూసి షాక్ తిన్న అపూర్వ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు తీగలాగితే డొంకంతా కదిలింది. చొక్కారపు గణేష్ తారల పేరుతో విటులకు ‘లొకాంటో’ వెబ్సైట్లో ఎరవేస్తూ చేస్తున్న అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. అయితే తన గుట్టురట్టు అయ్యిందనే విషయాన్ని గ్రహించిన గణేష్ తన ‘లొకాంటో’ వెబ్ సైట్లో ఉంచిన అమ్మాయిలు, హీరోయిన్స్ ఫోటోలు వివరాలను డిలీజ్ చేశారని.. వాటిని రికవరీ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పారు.
ప్రస్తుతం వెబ్ సైట్ నిర్వాహకుడు చొక్కారపు గణేష్ పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే కరీంనగర్ జిల్లాకు చెందిన చుక్కారపు గణేష్ ఓ జూనియర్ కాలేజ్లో లెక్చలర్గా పనిచేస్తూ ఈ అకృత్యాలకు పాల్పడుతుండటం విశేషం. కాలేజ్లో పనిచేస్తునే అక్కడ చాలా మంది అమ్మాయిల ఫోటోలను సేకరించి ఈ వెబ్సైట్లో అప్ లోడ్ చేసినట్లు తెలుస్తోంది. మాసాజ్లు, చాటింగ్, డేటింగ్, సెక్స్ అంటూ చాలా రకాలుగా విటుల నుండి ఈ వెబ్ సైట్ ద్వారా గణేష్ డబ్బులు సంపాదించే వాడు. అయితే ఈ వ్యవహారంలో గణేష్తో పాటు మరికొందరు ఉండి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు పోలీసుల దర్యాప్తులో ఉంది.

Related Articles

Leave A Reply

Your email address will not be published.