ఇంద్రగంటి హ్యాట్రిక్ కొడతాడా?

గత రెండు సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్నాడు దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి. నాని హీరోగా రూపొందిన ‘జెంటిల్మన్’, తక్కువ బడ్జెట్తో రూపొందిన ‘అమీతుమీ’ సినిమాలతో ఇంద్రగంటి విజయాలు సొంతం చేసుకున్నాడు. వీటికి ముందు ‘బందిపోటు’ వంటి డిజాస్టర్ తీసిన ఇంద్రగంటి ఈ రెండు సినిమాలతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఈ దర్శకుడి తాజా సినిమా ‘సమ్మోహనం’ నేడు విడుదల అయ్యింది. ఇందులో సుధీర్ బాబు, అదితీరావ్ హైదరీలు హీరోహీరోయిన్లుగా నటించినా.. ఇంద్రంటి మోహన్ కృష్ణ సినిమాగా ఇది ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించే అవకాశం ఉంది. తెలుగులో తనకంటూ ప్రత్యేకతను కలిగిన దర్శకుడిగా ఇంద్రగంటి పేరు తెచ్చుకున్నాడు. అచ్చ తెలుగు టైటిల్స్ కూడా ఈ దర్శకుడి ప్రత్యేకత. వెనుకటికి ‘అష్టాచమ్మా’ అంటూ హిట్ కొట్టిన ఈ దర్శకుడు ‘సమ్మోహనం’తో కూడా సమ్మోహనం చేయడం ఖాయమనే విశ్వాసంతో ఉన్నాడు.
ఆ కాన్ఫిడెన్స్ ఏ మేరకు నిజం అవుతుందో మరి కాసేపట్లో తెలుస్తుంది. ఇంద్రగంటి సినిమాల్లో మినిమం ఎంటర్టైన్ మెంట్ అయితే గ్యారెంటీ. అంత వరకూ భరోసా ఉంటుంది. ఇక బాక్సాఫీస్ వద్ద ఇంద్రగంటికి కొంత పోటీనే ఉంది. ‘కాలా’ ప్రభావం తక్కువగానే ఉన్నా రజనీ సినిమా కూడా అక్కడక్కడ థియేటర్లలో ఉంది. ఇక మల్టీప్లెక్స్ ప్రేక్షకులను బాలీవుడ్ సినిమా ‘రేస్ త్రీ’ ఆకర్షిస్తోంది. నిన్న ‘నా నువ్వే’ విడుదల అయ్యింది. వీటి మధ్యన ‘సమ్మోహనం’ సత్తా చూపిస్తుందేమో చూడాలి.

Related Articles

Leave A Reply

Your email address will not be published.