పవన్ కళ్యాణ్ అభిమానులకు రేణు దేశాయ్ మరోసారి వార్నింగ్!

పవన్ కళ్యాణ్ గురించి సోషల్ మీడియాలో ఓ ఫేక్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అందులో రేణు దేశాయ్ జనసేన అధినేత మీద దారుణమైన ఆరోపణలు చేసినట్లు ఉంది. ఈ ఫేక్ న్యూస్ మీద వెంటనే రెస్పాండ్ అవ్వాలని, లేనిచో మా దేవుడికి చెడ్డ పేరు వస్తుందంటూ.. కొందరు పవన్ అభిమానులు రేణుపై ఒత్తిడి తేవడంతో ఆమె తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఎప్పుడూ ఏదో ఒక కారణంతో నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నాకు వేధింపులు ఎదురైనపుడు మీరంతా ఎందుకు ఇలా రియాక్ట్ అవ్వలేదు? ఆయనకో రూల్, నాకో రూలా? అంటూ ఫైర్ అయ్యారు. నా జోలికి వస్తే మీ హీరో గుట్టు విప్పుతా. 2009 ఎన్నికల కోసమే నాకు తాళి కట్టాడు. 2014 ఎన్నికల్లో గొడవ కాకూడదనే ఇపపుడున్న ఆవిడకు తాళి కట్టాడు. మేమిద్దరం పెళ్లికి ముందే తల్లులమయ్యాం. ఇన్నాళ్లు పవన్ పరువుపోతుందని పెద్దవాళ్లు బ్రతిమిలాడితే ఊరుకున్నాను. ఇపుడు నా జీవితం నేను బ్రతకుతున్నా అతడి అభిమానులు వేధింపులు ఆపడం లేదు. పవన్ ఎంతో మంది అమ్మాయిల జీవితాలు నాశనం చేశాడు. నా కళ్ల ముందే వేరే అమ్మాయిలతో పవన్ పడుకున్నాడు. ఇపుడున్న అమ్మాయి పెళ్లి చేసుకోకపోతే కోర్టుకు ఈడుస్తానని భయ పెట్టింది. తాళి కట్టకుండా వదిలేసిన జాబితా చాలా పెద్దది.. అంటూ రేణు దేశాయ్ చెప్పినట్లు ఓ ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై స్పందించాలని రేణు దేశాయ్పై ఒత్తిడి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ ఫేక్ వార్తపై రియాక్ట్ అవ్వాలని, కొన్ని రాజకీయ పార్టీల వారు పవన్ కళ్యాణ్ మీద కావాలని ఇలాంటి ఫేక్ వార్తలతో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, వెంటనే దీనిపై రియాక్ట్ అవ్వడంతో పాటు కంప్లయింట్ ఇవ్వాలి, మీరు సైలెంటుగా ఉంటే ఇలాంటి ఇంకా ఎక్కువ చేస్తారంటూ.. కొందరు అభిమానులు రేణు దేశాయ్ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఆమెకు సందేశాలు పంపడం మొదలు పెట్టారు. ప్రశాంతత లేకుండా చేస్తున్నారంటూ రేణు దేశాయ్  నా జీవితం ప్రశాంతంగా సాగాలనే ఉద్దేశ్యంతో కేవలం ఇన్స్టాగ్రామ్ మాత్రమే వాడాలని అనుకున్నాను. కానీ అక్కడ కూడా కొందరు నాకు ప్రశాంత లేకుండా చేస్తున్నారు.. అంటూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న సందేశాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Related Articles

Leave A Reply

Your email address will not be published.