మా దేవుడిని అవమానించిన నీచులని శిక్షించాలి అన్న నాగబాబు!

హిందువులు దైవంగా భావించే శ్రీరాముడి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సినీ నటుడు, నిర్మాత నాగబాబు డిమాండ్ చేశారు. మా నాన్నగారు ఆంజనేయ స్వామి భక్తుడు. నిత్యం ఆంజనేయ స్వామిని, శ్రీరాముడిని, సీతమ్మ వారిని ప్రార్థించే వ్యక్తి. సాయంత్రం అయితే మా నాన్న రామ నామ సంకీర్తనతో పూజ ప్రారంభిస్తే అయ్యే దాకా మేము ఎప్పుడూ ఇంట్లోనే ఉండేవారం. అలా మాకు రాముడి మీద చాలా భక్తి ఏర్పడింది. అటు చిరంజీవి అన్నయ్యకు, కళ్యాణ్ బాబు, మా కుటుంబం అంతా శ్రీరాముడిని భగవంతుడి లాగా ప్రార్థిస్తామని నాగబాబు చెప్పుకొచ్చారు.
అలా చేయడం తప్పు రామాయణం అనేది కేవలం ఒక పుస్తకం కాదు… అది హిందూ ధర్మం గురించి చెప్పే గ్రంధం, క్రిస్టియన్స్కు బైబిల్, ముస్లింలకు ఖురాన్ ఎలాంటిదో హిందువులకు రామాయణం, మహాభారతం, భగవద్గీత అలాంటివి. వీటిని మీద ఎవరు కామెంట్ చేసినా తప్పే. అటు ముస్లింల మొక్క ఖురాన్ మీద కామెంట్ చేసినా, క్రిస్టియన్స్ బైబిల్ మీద కామెంట్ చేసినా, హిందువుల గ్రంధాలను కామెంట్ చేసినా ఏదైనా తప్పే…. అని నాగబాబు అన్నారు.. ఆ వ్యక్తి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడను. నా మతం మీద, నా రామాయణం మీద కామెంట్ చేసిన నీచులను కఠినంగా శిక్షించాలి. ఆ వ్యక్తి పేరు చెప్పడానికి కూడా నా మనసు అంగీకరించం లేదు. అతడికి భయంకరమైన శిక్ష పడితీరాలి. చంద్రబాబు నాయుడుగానీ, కేసీఆర్ కానీ ఈ విషయంలో రియాక్ట్ కాకపోతే చారిత్రాత్మక తప్పదం చేసిన వారు అవుతారు,హిందూ సమాజాన్ని నిర్లక్ష్యం చేసిన వారు అవుతారు.. అని నాగబాబు అన్నారు. నేను మత సంబంధమైన పార్టీకో, సంస్థకో చెందిన వాడిని కాదు. నేను మత సంబంధమైన పార్టీకో, సంస్థకో చెందిన వాడిని కాదు. నేను ఒక సెక్యులర్ హిందువును, నా ఫ్రెండ్స్ ముస్లింలు, క్రిస్టియన్స్ ఉన్నారు. మేమంతా కలిసి మెలిసి జీవిస్తున్నాం. వారు మమ్మల్నికానీ, మేము వాళ్ల మత విశ్వాసాలను అవమానించలేదు. నాస్తికత్వం మీద నమ్మకం ఉంటే దాని మీద ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేసుకోండి. అంతే కానీ నాస్తికత్వం పేరు చెప్పి హిందూ మతం మీదకు వస్తే తగిన ఫలితం అనుభవిస్తారు. ప్రభుత్వం ఈ వ్యక్తి మీద చర్య తీసుకోకపోతే చాలా పెద్ద తప్పు చేసిన వారు అవుతారు అని నాగబాబు హెచ్చరించారు.
పథకం ప్రకారం దాడి జరుగుతోంది
ఒక పథకం ప్రకారం, ఒక పద్దతి ప్రకారం హిందూ మతం మీద, హిందు మత విశ్వాసాల మీద దాడి జరుగుతోంది. హిందూ సాంస్కృతిక విధ్వంసం జరుగుతోంది. దీనికి భారత దేశంలో చాలా మీడియా సంస్థలు కొమ్ము కాస్తున్నాయి. నూటికి 80 శాతం సంస్థలు హిందూ వ్యతిరేక భావజాలాన్ని వ్యాప్తిచేయడంలో ముందున్నాయి. ఇలాంటి మత సంబంధమైన డిబేట్స్ పెట్టకూడదని ప్రభుత్వం ఒక రూల్ పాస్ చేయాలి. ఎవడి ఇష్టం వచ్చినట్లు వాడు హిందువులను తిడుతుంటే చేతులు కట్టుకుని ఎవరూ కూర్చోరు. తప్పకుండా రియాక్ట్ అయి తీరుతామనపి నాగబాబు అన్నారు.

Related Articles

Leave A Reply

Your email address will not be published.