పవర్ స్టార్ ఫ్యాన్స్ కి వార్నింగ్ ఇచ్చిన రేణు దేశాయ్!

ఇటీవలే తన కొత్త జీవిత భాగస్వామి గురించి ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇస్తూ సోషల్ మీడియాలో పిక్ షేర్ చేసుకున్న పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ అతని ఫాన్స్ కు మరో వార్నింగ్ లాంటి హెచ్చరిక ఇచ్చేసింది. అకీరా నందన్ ను ఎవరైనా జూనియర్ పవర్ స్టార్ అని సంభోదిస్తే ఒప్పుకోనని అలా పెట్టే కామెంట్స్ ని వెంటనే డిలీట్ చేస్తానని చెప్పేస్తోంది. అకీరా ప్రస్తుతం పూణేలో నటనతో పాటు ఇతర క్రాఫ్ట్స్ లో శిక్షణ తీసుకుంటున్నాడు. అకీరాను సినిమాల్లోకి తీసుకురావడం రేణుకు ఇష్టమే కానీ పవన్ వారసుడిగా కాదని మాత్రం రేణు మాటల్లో అర్థమవుతోంది. నిజానికి రేణు అకీరాని తెలుగు సినిమాల ద్వారానే లాంచ్ చేయాలి అనుకుంటే ఒప్ప్పుకున్నా ఒప్పుకోకపోయినా పవన్ ఫాన్స్ మాత్రం అతడిని తమ హీరో వారసుడిగానే చూస్తారు.
సౌత్ లో ఉండే హీరోల వారసత్వపు ట్రెండ్ ప్రకారం చూసుకుంటే అలా జరగడంలో ఆశ్చర్యం లేదు. అభిమానులను తప్పు బట్టడానికి లేదు. పైగా నిర్మాతలు కూడా అకీరాను ఓపెనింగ్స్ కోసం బ్రాండ్ కోసం పవన్ కొడుకుగానే ప్రమోట్ చేస్తారు తప్ప ఇంకోలా కాదు. అలా చేయకపోతే బిజినెస్ జరగదు.
కానీ రేణు దేశాయ్ ప్లాన్స్ వేరుగా ఉన్నాయట. బెంగాలీ, మరాఠి, భోజ్ పూరి ఈ మూడు భాషల్లో ఒకదానిలో అకీరాను హీరోగా చూసుకోవాలన్నది రేణు దేశాయ్ టార్గెట్. అలా చేస్తే సమస్య లేదు. వాళ్లకు పవన్ అంటే ఎవరో తెలియదు కాబట్టి అకీరాను రెగ్యులర్ హీరోగా చూస్తారు. అవి ఎలాగూ నేటివిటీ ప్రాబ్లమ్ వల్ల తెలుగులో డబ్ కావు. సో అక్కడ స్టార్ అయినా వచ్చిన నష్టం ఏమి లేదు. కానీ వాటికి మార్కెట్ చాలా తక్కువ. ఆదాయం కూడా మరీ గొప్పగా ఉండదు. ఉన్నంతలో మరాఠి పరిశ్రమ కాస్త నయం. సైరాట్ తర్వాత మార్కెట్ రేంజ్ వంద కోట్లు దాటేసింది. కానీ అది రెగ్యులర్ గా జరగదు. సో అకీరాను స్టార్ చేయాలంటే మాత్రం టాలీవుడ్ తీసుకురావడం మినహా ఛాన్స్ లేదు. మరి పవన్ వారసుడు అనకండి అని రేణు నేరుగా చెప్పేస్తున్న నేపథ్యంలో అకీరా ఎంట్రీ ఎక్కడ ఉంటుందో రానున్న రోజుల్లో ఆసక్తికరంగా మారింది.

Related Articles

Leave A Reply

Your email address will not be published.