బన్నీ సినిమా నిర్మాత, అల్లు అర్జున్ తో నాలుగోసారి!

నా పేరు సూర్య చిత్రం తరువాత బన్నీ కొత్త చిత్రంపై ప్రయత్నాలు ప్రారంభించాడు. ఆ దిశగా కదలికలు మొదలైనట్లు తెలుస్తోంది. నా పేరు సూర్య చిత్రం ఫాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచింది. దీనితో నెక్స్ట్ మూవీ తో అభిమానులని సంతృప్తి పరచాలని బన్నీ భావిస్తున్నాడు. ఆలస్యం జరిగినా మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలనేది బన్నీ ఆలోచన. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించడం దాదాపుగా ఖరారైంది. ఇక ప్రకటన మాత్రమే తరువాయి అని సినీవర్గాలు అంటున్నాయి. ఈ చిత్ర విషయంలో మరో ముందడుగు పడింది. నా పేరు సూర్య చిత్రం నిరాశపరిచిన తరువాత పలువురు దర్శకులు వినిపించిన కథలని బన్నీ విన్నాడు. విక్రమ్ కుమార్ తో పాటు, శేఖర్ కమ్ముల, హరీష్ శంకర్, విఐ ఆనంద్ బన్నీకి కథ వినిపించినట్లు తెలుస్తోంది. చివరకు అల్లు అర్జున్ విక్రమ్ కుమార్ పైనే నమ్మకం ఉంచాడు. బన్నీ సూచించిన కొన్ని మార్పులతో విక్రమ్ కుమార్ ప్రస్తుతం కథకు తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం గురించి అధికారికంగా ప్రకటన చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. డివివి దానయ్య ఇటీవల వరుసగా బడా చిత్రాలని నిర్మిస్తున్నారు. ఆయన నిర్మించిన భరత్ అనే నేను సమ్మర్ లో సందడి చేసిన సంగతి తెలిసిందే. రాంచరణ్, బోయపాటి చిత్రాన్ని , రాజమౌళి మల్టీస్టారర్ చిత్రాన్ని నిర్మిస్తుంది కూడా ఆయనే. అల్లు అర్జున్ తో ఇప్పటికే దానయ్య మూడు చిత్రాలు నిర్మించారు. దేశముదురు, జులాయి, వరుడు చిత్రాలు ఆయన నిర్మాణంలో వచ్చినవే. నాలుగోసారి ఈ కాంబినేషన్ సిద్ధం అవుతోంది.

Related Articles

Leave A Reply

Your email address will not be published.