తిప్పరా మీసం’ తో రెడీ అవుతున్న శ్రీ విష్ణు!

రొటీన్‌కు భిన్నంగా విలక్షణమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీవిష్ణు. నారా రోహిత్‌కు మంచి స్నేహితుడైన ఈ నటుడు ‘బాణం’, ‘సోలో’ సినిమాల్లో చిన్న పాత్రలు చేశారు. ఆ తరవాత ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘ప్రతినిధి’ సినిమాల్లో ముఖ్య పాత్ర పోషించారు. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘సన్ ఆఫ్ సత్యమ్మూర్తి’లోనూ శ్రీవిష్ణుకి పాత్ర దక్కింది. అయితే 2016లో వచ్చిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమా శ్రీవిష్ణుకు హీరోగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. కిందటేడాది ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాలో రామ్ స్నేహితుడిగా శ్రీవిష్ణు నటన ఆకట్టుకుంది. అయితే కిందటేడాది శ్రీవిష్ణు హీరోగా వచ్చిన ‘మెంటల్ మదిలో’ మంచి విజయాన్ని అందుకుంది. సోలో హీరోగా శ్రీవిష్ణుకు హిట్ సినిమా ఇదే. ఈ ఏడాది ‘నీది నాదీ ఒకే కథ’ సినిమాతో శ్రీవిష్ణు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం విమర్శకులు ప్రశంసలు అందుకున్నా కలెక్షన్లు మాత్రం రాబట్టలేకపోయింది. ఇందులో చిత్తూరు యాసలో శ్రీవిష్ణు అదరగొట్టాడు. ఇదిలా ఉంటే, తాజాగా శ్రీవిష్ణు హీరోగా మరో సినిమా ప్రారంభమైంది. నారా రోహిత్‌తో ‘అసుర’ చిత్రాన్ని తెరకెక్కించిన కృష్ణ విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘తిప్పరా మీసం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శ్రీవిష్ణు ‘తిప్పరా మీసం’ మూవీ ఓపెనింగ్ ఈ చిత్ర ప్రారంభోత్సవం శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హీరో నారా రోహిత్ విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశానికి రోహిత్ క్లాప్ కొట్టగా.. శ్రీనివాస్ యాదవ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సినిమాలో శ్రీవిష్ణు లుక్ డిఫరెంట్‌గా ఉండనుంది. గుబురు గెడ్డం, మీసాలతో శ్రీవిష్ణు కొత్తగా కనిపిస్తున్నారు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, శ్రీ ఓం సినిమాస్ పతాకాలపై రిజ్వాన్ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తారు.

Related Articles

Leave A Reply

Your email address will not be published.