‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ఫైవ్ మిలియన్ వ్యూస్

శ్రీను వైట్ల దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రాబోతున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. కాగా అక్టోబర్ 29న విడుదల అయిన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే టీజర్ 5 మిలియన్ వ్యూస్ ని సాధించింది. థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో టీజర్ ఇంట్రస్టింగ్ గా వుందని అంటున్నారు నెటిజన్లు. ఇక రవితేజ ఈ సినిమాలో మూడు డిఫ్రెంట్ షేడ్స్ లో కనిపించనున్నాడు.

కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. నవంబర్ 16న విడుదల కానుంది. ఇలియానా మళ్లీ చాలా కాలం తరువాత ఈ చిత్రంతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తుంది. అయితే గత కొంతకాలంగా శ్రీను వైట్ల, రవితేజ వరుస పరాజయాలతో సతమతవుతున్నారు. దాంతో ఈ చిత్రం ఈ ఇద్దరికీ చాలా కీలకం కానుంది.

Related Articles

Leave A Reply

Your email address will not be published.